*కూతురి అప్పగింతలో తీవ్ర విషాదం!*
భద్రాది జిల్లా :ఆగస్టు 18*
కూతురు వివాహాన్ని ఘనంగా జరిపించి అత్తవారింటికి పంపే క్రమంలో ఆ తల్లి హఠా త్తుగా కుప్పకూలిపోయింది ఈ విషాద ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లాలోని కామేపల్లి మండలం అబ్బాసు పురం తండాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది…
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… అబ్బాసుపురం తండాలో బానోతు మోహన్ లాల్, కల్యాణి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కూతురు సింధు ఉంది. టేకులపల్లి మండలం కొత్తతండాకు చెంది యువకుడితో తన కుమార్తె పెళ్లిని ఘనంగా జరిపించింది.
ఆదివారం సాయంత్రం కూతురు అప్పగింతల కార్యక్రమం జరుగుతుం డగా తల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు.
దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు. అబ్బాస్ పురం తండాలో విషాదచాయలు అలుముకున్నాయి.