నల్గొండ జిల్లాలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య?
నల్గొండ జిల్లా :ఆగస్టు 17
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 6వ వార్డు ఇందిరమ్మ కాలనీ శివార్లలో శనివారం రాత్రి ఇంటర్ విద్యార్థి దారుణ హత్య కు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో వన్ టౌన్, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు.
స్థానికులు, కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీకి చెందిన మాధగోని సత్యనారా యణ, నాగమణి దంపతుల కుమారుడు ఈశ్వర్ (18) పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడి యట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు
కాగా ఇంటి నుంచి కాలనీ శివారులోని వెళ్లిన ఈశ్వర్ మెడ భాగంలో తీవ్రగాయా లతో మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మేరకు వన్ టౌన్ సిఐ మోతీరాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు