చైన్ స్నాచింగ్ కేసును 24 గంటల్లో చేదించిన లోకేశ్వరం పోలీసులు
మనోరంజని ప్రతినిధి – నిర్మల్, ఆగస్టు 15
నిర్మల్ జిల్లా లోకేశ్వరం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చైన్ స్నాచింగ్ కేసును 24 గంటల్లోనే చేదించారు.
ఆగస్టు 14న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వాస్తాపూర్ గ్రామానికి చెందిన మేకల యమున అబ్దుల్లాపూర్ రోడ్డుపై పశువులు మేస్తూ ఉండగా, ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించి బైక్పై పరారైన పిప్పెర విజయ్ (ఆష్ట గ్రామం)ను పోలీసులు పట్టుకున్నారు.
సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, కేసు నమోదు చేసి కేవలం 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకొని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.
నిందితుడి వద్ద నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడు మరియు నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల (ఐపీఎస్), బైంసా డీఎస్పీ అవినాష్ కుమార్ (ఐపీఎస్), ముధోల్ సీఐ జి.మల్లేష్ – చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిని పట్టుకున్న లోకేశ్వరం ఎస్ఐ జి.అశోక్, కానిస్టేబుల్స్ శ్రీనివాస్, సాయి ప్రశాంత్, లక్ష్మణ్ లను అభినందించారు.