ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి అంతర్రాష్ట్ర దొంగ పరార్
– ఇతని పై రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సుమారు 25కు పైగా కేసులు..
– మూడు రోజుల క్రితం రాజుపాలెం మండలం టంగుటూరు గ్రామంలో జరిగిన చోరీ కేసులో అరెస్టు చేసిన రాజుపాలెం పోలీసులు
* గత మూడు రోజులుగా ప్రొద్దుటూరు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మహమ్మద్ రఫీ ఈ రోజు ఉదయం జైలు నుంచి పరారయ్యాడు.
* ఇతన్ని రాజుపాలెం మండలం, టంగుటూరు గ్రామంలో పట్టపగలే చోరీ చేస్తుండగా గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు.
* అనంతరం పోలీసులకు అప్పగించారు
* కేసులో ఈ నెల 13 న రాజుపాలెం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
* సబ్ జైలు లో రిమాండ్ లో ఉన్న అతను ఈ రోజు ఉదయం తప్పించుకొని వెళ్ళాడు.
* విచారణ నిమిత్తం జైళ్ళ శాఖ ఉన్నతాధికారులు ప్రొద్దుటూరుకు వస్తున్నారు