జింకమాంసం పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు
ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 11
ముధోల్ మండలంలోని విట్టోలి తాండ శివారులో జింక మాంసాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విట్టోలి తండా శివారులో జింకమాంసం విక్రయిస్తున్న సమాచారం అందడంతో అధికారులు ఘటన స్థలానికి వెళ్లారు. ఇది గమనించిన నిందితులు పారిపోగా మాంసాన్ని స్వాధీనపరచుకున్నారు. నిందితులకు సంబంధించిన ఆరు బైక్లను భైంసా ఫారెస్ట్ ఆఫీసుకు తరలించినట్లు ఫారెస్ట్ పోలీసులు పేర్కొన్నారు.