లంచం తీసుకుంటూ ACBకి దొరికిన పంచాయతీరాజ్ AEE అనిల్ కుమార్
జగిత్యాల జిల్లా కేంద్రంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) అనిల్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
23 లక్షల బిల్‌కు అనుమతి ఇవ్వాలంటే 18 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. కోరుట్లకు చెందిన కాంట్రాక్టర్ వెంకటేశ్‌తో 10 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
మొదటిగా 3 వేల రూపాయలు తీసుకున్న అనంతరం, మిగిలిన 7 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ, పూర్తి విచారణ చేపట్టింది.