యూపీలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య
యూపీ బారాబంకి జిల్లాలో దారుణం జరిగింది. సుబేహా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న 28 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ విమలేష్ పాల్ హత్యకు గురయ్యారు. నాలుగు రోజులుగా ఆమె కనిపించకుండా పోయారు. అయితే బుధవారం ఆమె మృతదేహం బిందౌరా గ్రామ సమీపంలోని బండా-బహ్రైచ్ హైవే పక్కన పొదల్లో కనిపించింది. ముఖం కాలిపోయి ఉంది. ఐజీ ప్రవీణ్ కుమార్, ఎస్పీ అర్పిత్ విజయవర్గియా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు