ఏడేళ్లుగా సహజీవనం.. పెళ్లికి నో చెప్పడంతో వివాహిత ఆత్మహత్యాయత్నం
తెలంగాణ : సూర్యాపేట జిల్లా కోదాడలో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ వివాహిత ప్రియుడు ఇంటి ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్ళై భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ ఏడేళ్ల నుంచి కోమరబండకు చెందిన యువకుడితో సహజీవనం చేస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ కోరగా అతడు నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది