సీఎం నివాసానికి బాంబు బెదిరింపు కాల్!
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, టీవీకే అధినేత, నటుడు విజయ్ నివాసాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో సీఎం నివాసంలో తనిఖీలు నిర్వహించారు. అనంతర విచారణలో ఇది ఫేక్ కాల్ అని పోలీసులు నిర్ధారించారు. సీఎం నివాసం చుట్టుపక్కల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అటు విజయ్ ఇంట్లో కూడా ఏలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.