- 66 మంది బాల కార్మికులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగింపు
- 30 మందిపై బాల కార్మికులను పనిలో పెట్టుకున్నందుకు కేసులు నమోదు
- బాలల హక్కులను కాపాడేందుకు ప్రత్యేక బృందాల ద్వారా ఆపరేషన్ స్మైల్ విజయవంతంగా నిర్వహణ
- ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంసా పత్రాలు పంపిణీ
నిర్మల్ జిల్లాలో ఆపరేషన్ స్మైల్ -XIవ విడతలో 66 మంది బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా వ్యాప్తంగా 30 మందిపై బాల కార్మికులను పనిలో పెట్టుకున్నందుకు కేసులు నమోదు చేశారు. ప్రత్యేక బృందాల సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
నిర్మల్ జిల్లాలో జనవరి 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు ఆపరేషన్ స్మైల్ -XI కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా 66 మంది బాల కార్మికులను గుర్తించారు, వీరిలో 64 మంది అబ్బాయిలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. ఈ పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో పాటు, చిన్నారులను పనిలో పెట్టుకున్న 30 మందిపై కేసులు నమోదు చేశారు.
జిల్లాలో ఆపరేషన్ స్మైల్ విజయవంతంగా నిర్వహించేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ తెలిపారు. బాలల హక్కులను కాపాడేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. బాలలను పనిలో పెట్టుకున్న విషయాన్ని వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేంద్ర రెడ్డి, రాజేష్ మీన ఐపిఎస్, నాగలక్ష్మి (సీడీపీవో), వాహిద్ (CWC చైర్మన్), రాజా లింగు (అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్), మురళీ (డిసిపిఒ) తదితర అధికారులు పాల్గొన్నారు.