ఆర్మూర్‌లో అనుమానాస్పదంగా గుర్తుతెలియని మహిళ మృతి

ఆర్మూర్‌లో గుర్తుతెలియని మహిళా మృతి – పోలీసుల దర్యాప్తు
  • బృందావన్ టాకీస్ సమీపంలోని నిర్మాణంలో మహిళా మృతి
  • 40 సంవత్సరాల వయసున్న మహిళ ఫిట్స్ వల్ల ప్రమాదవశాత్తు మరణించినట్లు అనుమానం
  • పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది – సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి



నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని బృందావన్ టాకీస్ సమీపంలో అనుమానాస్పదంగా గుర్తుతెలియని మహిళ మృతిచెందింది. కొత్తగా నిర్మిస్తున్న భవనంలో సంపులో ఆమె శవం లభ్యమైంది. ఫిట్స్ రావడం వల్ల ప్రమాదవశాత్తు ఆమె పడిపోయి మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మహిళను గుర్తించే వారు ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాల్సిందిగా ఎస్‌హెచ్‌ఓ కోరారు.



నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో బృందావన్ టాకీస్ సమీపంలోని ఓ నిర్మాణంలో గుర్తుతెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బుధవారం ఉదయం బిల్డింగ్ వాచ్‌మెన్ మహిళా శవాన్ని సంపులో గుర్తించి, బిల్డింగ్ ఓనర్ అల్జాపూర్ రాజేష్‌కు సమాచారం అందించాడు.

ఈ విషయాన్ని రాజేష్ వెంటనే పోలీసులకు తెలియజేయగా, ఆర్మూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి వయసు 40 సంవత్సరాలుగా అంచనా వేస్తున్నారు. ఫిట్స్ రావడం వల్ల ఆమె ప్రమాదవశాత్తు సంపులో పడిపోయి మృతి చెందినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

అయితే, మహిళ అక్కడికి ఎలా వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని ఈ మహిళ గురించి సమాచారం తెలిసినవారు ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌ను తక్షణం సంప్రదించాలని ఎస్‌హెచ్‌ఓ విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment