✅ జనవరి 26న కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఎస్సై అవార్డు
✅ లంచం కోసం ₹70,000 డిమాండ్ చేసిన వేణుగోపాల్ గౌడ్
✅ ఏసీబీ వలలో పట్టుబడిన ఎస్సై, డ్రైవర్ బీరప్ప
✅ నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న అధికారులు
జనవరి 26న ఉత్తమ ఎస్సైగా అవార్డు అందుకున్న ధారూర్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్ అవినీతి కేసులో పట్టుబడ్డారు. ఓ కేసులో వ్యక్తిని తప్పించేందుకు ₹70,000 లంచం డిమాండ్ చేయగా, ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. బీరప్ప అనే డ్రైవర్‌తో కలిసి ₹30,000 స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
వికారాబాద్ జిల్లా ధారూర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ గౌడ్, ఇటీవలే తన కృషికి గుర్తింపుగా జనవరి 26న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఎస్సై అవార్డు అందుకున్నారు. అయితే అవార్డు పొందిన కొద్ది రోజులకే లంచం కేసులో చిక్కుకున్నారు.
మంగళవారం, ఓ కేసులో వ్యక్తిని తప్పించేందుకు ₹70,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు డబ్బులు ఇవ్వకుంటే కేసు పెట్టి జైలుకు పంపుతానని బెదిరించడంతో, చేసేది లేక ₹30,000 ముందుగా ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. కానీ అతను ఏసీబీ అధికారులను సంప్రదించాడు.
ఏసీబీ అధికారులు వల వేసి వేణుగోపాల్ గౌడ్, అతని డ్రైవర్ బీరప్పను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతి సొమ్ము స్వీకరించినట్లు రుజువై, ఇద్దరినీ నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు అధికారులు తెలిపారు.