*నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో కొండచిలువల కలకలం.*
*కార్యాలయ పక్కనే చెట్లపొదల్లో ఉద్యోగుల కంటపడ్డ కొండచిలువలు*
భయాందోళనతో స్నేక్ క్యాచర్కు సమాచారం
మనోరంజని ప్రతినిధి
నాగర్ కర్నూల్ జిల్లా. : ఫిబ్రవరి 08
కలెక్టర్ కార్యాలయం (Nagarkurnool ప్రాంగణంలో Collectorate) కొండచిలువలు (Python Chaos) కలకలం రేపాయి. గ్రౌండ్ ఫ్లోర్ లోని జి8 కార్యాలయ వెనుక భాగంలో చెట్ల పొదల్లో రెండు కొండచిలువలు ఉద్యోగుల కంటపడ్డాయి. శనివారం ఉద్యోగులు కార్యాలయానికి వచ్చిన అనంతరం వెనుక భాగంలో ఏదో కదులుతున్నట్లుగా గమనించారు. పాములు ఉన్నట్లు గుర్తించి వెంటనే స్నేక్యాచారుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వాటిని పట్టుకొని ఓ ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు. సుమారు 6 అడుగుల పైకినే రెండు కొండ చిలువలు కనిపించడంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.