- బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కు లూథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ.
- మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వకుండా హాజరుకాకపోవడంతో కోర్టు చర్య.
- ఫిబ్రవరి 10న తదుపరి విచారణ.
ప్రముఖ నటుడు సోనూ సూద్‌కు లూథియానా కోర్టు షాక్ ఇచ్చింది. మోసం కేసుకు సంబంధించి వాంగ్మూలం ఇవ్వకుండా హాజరుకాకపోవడంతో కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మోహిత్ శర్మ అనే వ్యక్తి రిజికా కాయిన్ పేరుతో రూ.10 లక్షలు మోసం చేసినట్లు న్యాయవాది రాజేశ్ ఖన్నా ఫిర్యాదు చేశారు. కోర్టు పలుమార్లు సమన్లు పంపినా సోనూ సూద్ స్పందించలేదు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్‌కు లూథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వకుండా కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కేసు వివరాల ప్రకారం, మోహిత్ శర్మ అనే వ్యక్తి రిజికా కాయిన్ పేరుతో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశాడని లూథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్ ఖన్నా కోర్టులో ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో సోనూ సూద్‌ను సాక్షిగా పేర్కొనగా, కోర్టు పలుమార్లు సమన్లు పంపినా ఆయన హాజరు కాలేదు. దీంతో లూథియానా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రమన్‌ప్రీత్ కౌర్ నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసి, అతడిని కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 10న జరగనుంది.