లింగాపూర్ లో అగ్ని ప్రమాదం.
-ఒక ఎద్దు మృతి,మరో ఎద్దుకు గాయాలు.
-2.లక్షల ఆస్తి నష్టం.
మనోరంజని ప్రతినిధి
సారంగాపూర్ : ఫిబ్రవరి 05
నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలంలోని లింగాపుర్ గ్రామంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగి పశువుల కొట్టం దాహనమై ఒక ఎద్దు మృతి చెందగా మరొక ఎద్దుకు తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటనలో ఎద్దులతో పాటు పశుగ్రాసం(గడ్డి), వ్యవసాయ పనిముట్లు దగ్ధం అయినట్లు బాధితుడు తోడశం పూలరి తెలిపాడు .ఈ ప్రమాదంలో రూ.2.లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోయాడు.
బాధిత రైతుకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.