- వాషింగ్టన్ సమీపంలో హెలికాప్టర్, జెట్ విమానం ఢీ కొన్న ఘటన
- పోటోమాక్ నదిలో కూలిన రెండూ
- 28 మంది మృతదేహాలు వెలికితీత, సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి
వాషింగ్టన్ డీసీ సమీపంలోని పోటోమాక్ నదిలో జెట్ విమానం మరియు హెలికాప్టర్ ఢీ కొట్టిన ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 28 మంది ప్రయాణికుల మృతదేహాలను వెలికితీశారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అధికారులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలంలో కృషి చేస్తూనే ఉన్నారు, మరిన్ని మృతుల సమాచారం అందే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
2025 జనవరి 30:
వాషింగ్టన్ డీసీ సమీపంలోని రోనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టు రన్‌వేపై విమానం దిగేందుకు సిద్దమవుతోన్న సమయంలో యూఎస్ రక్షణ శాఖ హెలికాప్టర్ జెట్ విమానంతో ఢీ కొట్టింది. ఈ ఘటనలో విమానంలో 64 మంది ప్రయాణీకులు ఉన్నారు. అమెరికన్ ఎయిర్ లైన్స్ ప్రకారం, జెట్ విమానంలో 60 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బంది ఉన్నారు.
హెలికాప్టర్లో ముగ్గురు సైనికులు ఉన్నారని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. రెండు వాహనాలు పోటోమాక్ నదిలో కూలిపోయిన సమయంలో, 28 మృతదేహాలు వెలికితీశారు. రెస్క్యూ సిబ్బంది నదిలో గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ ఘటనలో మరిన్ని మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.