ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా,
ఆర్మూర్ మండలం, జనవరి 23 మనోరంజని ప్రతినిధి,
ఆర్మూర్ కేంద్రంలోని,నల్ల పోచమ్మ గల్లి,చెందిన పాలుపు అభిలాష్ ( 23 ) అనే యువకుడు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ, కుటుంబం పోషించేవాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, తన ఇంట్లో ఫ్యాను కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు.పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. , మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆర్మూర్ ఎస్సై పి. సత్యనారాయణ తెలిపారు