ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
బాసర, అక్టోబర్ 28, 2024
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ శాసన సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం, బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాలలో చదివిన సామల ఫణి కుమార్ అనే పూర్వ విద్యార్థి, 2023లో బిటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అయితే, గత మూడు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉండటంతో, ట్రిపుల్ ఐటీ అధికారులు సర్టిఫికేట్లు ఇవ్వాలంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఫణి కుమార్ ఈ విషయమై విశ్వవిద్యాలయ అధికారులతో పాటు పూర్వ వైస్ ఛాన్సలర్, పూర్వ స్పెషల్ ఆఫీసర్ మరియు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ అధికారులతో కూడా సమావేశమయ్యాడు. కానీ, ఎక్కడా స్పందన లభించకపోవడంతో, ఫీజు ప్రభుత్వంతో ఉండాలని డిమాండ్ చేశాడు. విసుగుపడిన ఫణి కుమార్, అక్టోబర్ 22న హైకోర్టును ఆశ్రయించాడు.
హైకోర్టు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీ రీయింబర్స్మెంట్ ఆపడం మరియు విద్యార్థుల సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం సరికాదని తెలిపింది. బాసర ట్రిపుల్ ఐటీకి అక్టోబర్ 24న నోటీసులు జారీ చేసి, అక్టోబర్ 25న సర్టిఫికేట్లు అందజేయాలని ఆదేశించింది.
ఇప్పటికే హైకోర్టు ఆదేశాల ప్రకారం, సోమవారం ఫణి కుమార్ కు సర్టిఫికెట్లు అందజేయడం జరిగి, అతను కొంతమేరకు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా, పలు మార్లు ప్రభుత్వం విద్యాసంస్థలకు ఫీ రీయింబర్స్మెంట్ ఆపిందనే కారణం, విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఆపకూడదని హైకోర్టు తీర్పును వెల్లడించాడు.
ఈ విజయం సాధించడంలో తనకు సహాయం చేసిన హైకోర్టు అడ్వకేట్ తక్కురి చందనకు, అడ్వకేట్ మనిదీప్, డా. చైతన్య మరియు మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.