ఆరు నెలల్లో సిరాల ప్రాజెక్టు పనుల పూర్తి పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

ఆరు నెలల్లో సిరాల ప్రాజెక్టు పనుల పూర్తి
పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

భైంసా : అక్టోబర్ 27

ఆరు నెలల్లో సిరాల ప్రాజెక్టు పనులు పూర్తిచేసి రైతాంగానికి సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం 8 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న సిరాల ప్రాజెక్టు, ఇలేగాం చెరువు పనులకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 నెలల క్రితం సిరాల ప్రాజెక్టు భారీ వర్షాలతో తెగిపోయిందని, ఆ సమయంలో తాను అక్కడే ఉండి రైతుల కష్టాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక సిరాల ప్రాజెక్టు కు పూర్వ వైభవం తెచ్చేందుకు తెచ్చేందుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని విన్నవించడం జరిగిందన్నారు. రైతాంగ సంక్షేమమే తన ధ్యేయమని ప్రాజెక్టు పూర్తి చేసి సిరాల ఇలేగాం, దేగాం, రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రభుత్వం తమది కానప్పటికీ, ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు. అప్పటి పాలకుల నిర్లక్ష్య వైఖరి మూలంగా నిజాం కాలం నాటి సిరాల ప్రాజెక్ట్ ను ఎవరు పట్టించుకోలేదన్నారు. ఒకప్పడు నియోజకవర్గం లో ఇదే పెద్ద ప్రాజెక్టు అన్నారు. రైతులు, మత్స్యకారులు, నష్టపోయారని ప్రభుత్వం వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిరాల గ్రామస్తులు పలు సమస్యలను విన్నవించారు. అదేవిధంగా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కు ఘనంగా స్వాగతించి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మురళి ధర్ రెడ్డి, డి. ఇ. ఇ. అనిల్ కుమార్,మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, నాయకులు సోలంకి భీంరావ్, సాంళి రమేష్,పండిత్ రావ్ పటేల్, మాజీ సర్పంచ్ లు చిన్నన్న, శ్రీనివాస్, మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి, మాజీ ఎం పి టి సి సుభాష్, సిరాల, ఇలేగామ్ గ్రామ పెద్దలు, మండల నాయకులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment