పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం?

*పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం?*

ఎమ్4 ప్రతినిధి*

హైదరాబాద్:అక్టోబర్ 27
నాచారం లోని మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పడుతుం డగా గంజాయి మత్తులో వున్న ఆకతాయిలు నిప్పు పెట్టారు.

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ షాకయ్యారు. దీంతో అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది నిప్పును ఆర్పేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు.

నాచారం పోలీస్​ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వాహనదారులతో రద్దీగా ఉంది. బంక్ సిబ్బంది బిజీగా ఉన్నారు. ఈ సమయంలో స్కూటీపై వచ్చిన యువకులు పెట్రోలు కావాలన్నారు.

దీంతో సిబ్బంది పెట్రోల్ నింపుతుండగా అందులో ఓ యువకుడు ఒక్కసారిగా జేబులో ఉన్న లైటర్​ తీసి నిప్పంటించాడు. అంతే ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. భయంతో అక్కడ ఉన్న వాహనదారు లంతా తలోదిక్కుకు పరుగులు తీశారు.

అయినా అంతటితో ఆగని ఆకతాయి, నిప్పు చెలరేగుతుండగానే దానిని మరోవైపు కాలితో నెట్టుతూ పైశాచిక ఆనందం పొందా డు. తీవ్ర భయాందోళనకు గురైన సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఫైర్‌ ఫోమ్‌తో మంటలు ఆర్పివేశారు.

దీంతో పెట్రోల్‌ బంక్‌లో ఉన్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించగా…పోలీసులు ఆకతాయిలను అదుపు లోకి తీసుకుని విచారిస్తు న్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment