*39 మంది బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు❓*
*కలం నిఘా :న్యూస్ ప్రతినిధి*
హైదరాబాద్ :అక్టోబర్ 27
తెలంగాణ బెటాలియన్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్ల ఆందోళనలు చర్చనీయాం శంగా మారాయి. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న బెటాలియన్ల వివిధ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న టీజీఎస్పీ కానిస్టే బుళ్లు ఆందోళనకు దిగారు. తొలుత కానిస్టేబుల్ లో భార్యలు నిరసనలు చేయగా…ఇటీవలే నేరుగా కానిస్టేబుళ్లే రోడ్లెక్కారు.
పోలీస్ డ్యూటీ పేరుతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి… ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.దీంతో టీజీఎస్పీ కానిస్టేబుళ్ల ఆందోళనలను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్లు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించా రని… అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. సస్పెన్షన్‌కు గురైన వారిలో 3 బెటాలియన్‌కు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. 17వ బెటాలియన్ లో ఆరుగురు, నాలుగో బెటాలియన్ లో ఆరుగురు, ఐదులో 6, ఆరులో 5, 12లో 5, 13వ బెటాలియన్ లో ఐదు మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. మొత్తం 39 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై డీజీపీ జితేందర్ స్పందించారు. క్రమక్షశిణకు మారుపేరైన పోలీస్ వ్యవస్థలో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఈ మేరకు డీజీపీ జితేందర్ శనివారం కీలక ప్రకటన చేశారు.
సెలవులపై పాత పద్ధతే అమలు చేస్తామని చెప్పినప్పటికీ కానిస్టేబుళ్లు ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఈ ఆందోళ నల వెనుక ప్రభుత్వ వ్యతి రేక శక్తులు ఉన్నాయనే అనుమానం ఉందన్నారు. ఆందోళనలలో పాల్గొన్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాని హెచ్చరిం చారు.