- కెనడాలోని టొరంటో సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
- టెస్లా కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన
- మృతుల్లో ఇద్దరు గుజరాత్‌కు చెందిన వారు
కెనడాలోని టొరంటో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం అర్ధరాత్రి టెస్లా కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి, కారులో ఉన్న వారంతా సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటనలో గుజరాత్‌కు చెందిన కేతా గోహిల్, నిల్ గోహిల్ మరణించారు. ఇతర వాహనదారులు సహాయం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
హైదరాబాద్, అక్టోబర్ 26
: కెనడాలోని టొరంటో సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు సజీవ దహనమయ్యారు. టొరంటో సమీపంలో ఓ టెస్లా కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కేటా గోహిల్ (30), నిల్ గోహిల్ (26) అనే గుజరాత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులతో పాటు మరొకరితో కలిసి ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
ప్రమాద సమయంలో కారు బ్యాటరీకి మంటలు అంటుకుని కారులోని నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు ప్రమాదం గుర్తించి వారిని రక్షించడానికి ప్రయత్నించినా, మంటలు వేగంగా వ్యాపించడంతో ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ దుర్ఘటనలో ఇటీవలే కెనడా పౌరసత్వం పొందిన వ్యక్తి కూడా మరణించారు.
ఈ ప్రమాదం పట్ల కెనడాలో నివసిస్తున్న భారతీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టొరంటో పోలీస్ విభాగం ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది.