దిగంబర్ మాశెట్టి వార్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే..

మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాశెట్టి వార్

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

భైంసా : అక్టోబర్ 26

మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాశెట్టి వార్ మృతి పట్ల ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సంతాపం వ్యక్తం చేసారు. అయన మృతి మన ప్రాంతానికి తీరని లోటన్నారు.మున్సిపల్ చైర్మన్ గా, మార్కెట్ కమిటి చైర్మన్ గా, డిసిసి అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు అమోఘం అన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఉన్న వ్యక్తి మా శెట్టి వార్ సరస్వతీ శిశు మందిరాల అభివృద్ధి కోసం పాటుపడ్డారన్నారు. తన తల్లి పేరిట కోట్లాది రూపాయల విలువైన సుభద్ర వాటిక భూమిని శిశు మందిరి కోసం ఇచ్చారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment