- ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం, గాజా పునర్నిర్మాణానికి 350 ఏళ్లు అవసరమని అంచనా.
- యుద్ధం వల్ల దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితులను తిరిగి పొందడం కష్టం.
- 2007-22 సంవత్సరాల మధ్య గాజా సగటు వృద్ధి రేటు 0.4% ఉన్నది.
గాజాలో స్ధితి ఆర్ధిక పునరుజ్జీవానికి 350 ఏళ్లు అవసరమని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల ఆర్థిక, మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 2007-22 మధ్య సగటు వృద్ధి రేటు 0.4% మాత్రమే ఉంది, యుద్ధం కంటే ముందటి ఆర్థిక స్థితి తిరిగి రావడానికి చాలా కాలం పడుతుంది.
M4 న్యూస్ (ప్రతినిధి): న్యూఢిల్లీ:
యుద్ధం మిగిల్చే నష్టాన్ని పూడ్చడం అంత సులువు కాదు. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం వల్ల దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణానికి దశాబ్దాలు పడుతుందని గతంలో చెప్పిన ఐక్యరాజ్య సమితి, ఈ గడువును పెంచింది.
2023 అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేయకముందు, నాటి ఆర్థిక పరిస్థితులు గాజాలో తిరిగి రావాలంటే 350 ఏళ్లు పడుతుందని ఐక్యరాజ్య సమితి తన తాజా నివేదికలో అంచనా వేసింది. 2007-22 సంవత్సరాల్లో గాజా సగటు వృద్ధి రేటు 0.4 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. వృద్ధి రేటు సాధించినా, జనాభా పెరుగుదల వల్ల స్థూల జాతీయ ఉత్పత్తి మరియు తలసరి ఆదాయం క్షీణించుతూనే ఉంటాయని తెలిపింది.
యుద్ధం వల్ల గాజాలో నిర్మాణాలు, రహదారులు, కీలక మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసమవ్వగా, దానితో పాటుగా శిథిలాలు, కుళ్లిన శవాలు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. పునర్నిర్మాణం ప్రారంభం కంటే ముందు, ఈ ప్రాంతాలను శుభ్రం చేయాల్సి ఉందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. 1670-1699 మధ్య యుద్ధాలు జరిగిన ఇంగ్లండ్, నెదర్లాండ్స్ దేశాలు ఈ పరిణామాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విషయాన్ని కూడా నివేదికలో ప్రస్తావించింది.