మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి రాధోడ్ రామ్ నాథ్

e Alt Name: Radhoad Ram Nath Bhainsa Market Committee Director
  • రాధోడ్ రామ్ నాథ్ కు భైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి.
  • ఎడ్బిడ్ తాండా గ్రామానికి చెందిన సామాన్య గిరిజన యువకుడు.
  • గురువారం భైంసా మార్కెట్ యార్డులో ప్రమాణం స్వీకారం.

: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని ఎడ్బిడ్ తాండా గ్రామానికి చెందిన గిరిజన యువకుడు రాధోడ్ రామ్ నాథ్ కు భైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి లభించింది. గురువారం ఆయన భైంసా మార్కెట్ యార్డులో ప్రమాణం స్వీకారం చేశారు. సామాన్య కాంగ్రెస్ కార్యకర్తకు ఈ పదవి రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

M4 న్యూస్, (ప్రతినిధి), ముధోల్:

నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో గల ఎడ్బిడ్ తాండా గ్రామానికి చెందిన గిరిజన యువకుడు రాధోడ్ రామ్ నాథ్ కు భైంసా మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవి లభించింది. రాధోడ్ రామ్ నాథ్, సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానంలో కృషి చేసి ఈ పదవి పొందారు. బుధవారం ప్రభుత్వం భైంసా మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో, రాధోడ్ రామ్ నాథ్ గురువారం భైంసా మార్కెట్ యార్డులో డైరెక్టర్ గా ప్రమాణం స్వీకారం చేశారు. ఒక సామాన్య గిరిజన యువకుడికి డైరెక్టర్ పదవి రావడం పట్ల స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశంసలు కురిపించారు. రామ్ నాథ్ ఈ పదవిలో తన సామాజిక సేవా కృషిని కొనసాగిస్తానని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment