- ట్రిపుల్ ఐటీ బాసర పూర్వ విద్యార్థుల ఫీజులపై హైకోర్టు నోటీసులు.
- విద్యార్థుల సర్టిఫికెట్లు విడుదల చేయడంపై కేసు.
- హై కోర్ట్ విద్యార్థుల తరపున ప్రభుత్వానికి, యాజమాన్యానికి వివరణ కోరింది.
హైకోర్టు ట్రిపుల్ ఐటీ బాసరకు నోటీసులు జారీ చేసింది. పూర్వ విద్యార్థి సామల ఫణి కుమార్ ఫీజులు చెల్లించని కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వలేదని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్, ట్రిపుల్ ఐటీ యాజమాన్యానికి వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది.
M4 న్యూస్, (ప్రతినిధి), బాసర:
తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక ట్రిపుల్ ఐటీ బాసర (రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం)కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్వ విద్యార్థి సామల ఫణి కుమార్ హైకోర్టును ఆశ్రయిస్తూ, ప్రభుత్వ ఫీజులు చెల్లించనందున బాసర యాజమాన్యం విద్యార్థుల సర్టిఫికెట్లు విడుదల చేయడం లేదని పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టులో ఈరోజు ఈ కేసుపై విచారణ జరగ్గా, పిటిషనర్ తరపున అడ్వకేట్ తక్కురి చందన వాదనలు వినిపించారు. విద్యార్థుల సర్టిఫికెట్లు విడుదల చేయకపోవడం విద్యార్థులకు అన్యాయం చేస్తోందని, విద్యా హక్కు ఉల్లంఘనగా భావించాలన్నారు. గతంలో కూడా తెలంగాణ హైకోర్టు సర్టిఫికెట్ల విషయమై అనేక జడ్జిమెంట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, త్రిపుల్ ఐటీ యాజమాన్యానికి, తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ శాఖకు నోటీసులు జారీ చేసింది.
ఈ కేసు అనేక విద్యార్థులకు సంబంధించిన అంశాలను ప్రతిబింబిస్తుందని, విద్యా సంస్థలు తమ బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం ఉందని పిటిషనర్ తరపున వాదనలు వినిపించబడ్డాయి.