హైదరాబాద్: అక్టోబర్ 24
భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచం విస్మరించదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ఆకాంక్షించారు. దూరంగా ఉన్న అమెరికా అయినా, అతి సమీపంలో ఉన్న చైనా అయినా ఏ దేశమైనా భారత్‌ను విస్మరించదని కేంద్ర మంత్రి సీతారామన్ వాక్యనించారు.
వాషింగ్టన్, DCలో ప్రపంచ బ్యాంక్ మరియు అంతర్జాతీయ వార్షిక సమావేశాలు 2024 సందర్భంగా ‘బ్రెట్టన్ వుడ్స్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎట్ 80: ప్రయారిటీస్ ఫర్ ది నెక్స్ట్ డికేడ్’ అనే అంశంపై సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు.
భారతదేశం ఎల్లప్పుడూ బహుపాక్షిక సంస్థలకు మద్దతునిస్తుంది. ఏ సమయంలోనూ ఏ బహుపాక్షిక సంస్థను బలహీనపరచడానికీ ప్రయత్నించలేదు. బహుపాక్షిక సంస్థల నుంచి ఎలాంటి పరిష్కారాలు రాకపోవడంతో వాటిపై అంచనాలు అడియాసలయినట్లు ఆమె అన్నారు.