ఆలయాల్లో దొంగతనాల నివారణకు సి. సి. కెమెరా లు ఏర్పాటు చేసుకోవాలి భైంసా రూరల్ సి. ఐ. నైలు

భైంసా రూరల్ సి. ఐ. నైలు

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి 2)

భైంసా : అక్టోబర్ 23

 భైంసా రూరల్ సి. ఐ. సీసీ కెమెరా ఏర్పాటు సూచన

ఆలయాల్లో దొంగతనాల నివారణకు గ్రామ అభివృద్ధి కమిటీలు సి. సి. కెమెరా లు ఏర్పాటు చేసుకోవాలని భైంసా రూరల్ సి. ఐ.నైలు సూచించారు. బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్ లో గ్రామ అభివృద్ధి, ఆలయ కమిటీ లతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా మాట్లాడారు.. శాంతి భద్రతల పరిరక్షణ కు గ్రామల వారీగా సెక్టార్ లను ఏర్పాటు చేసి పోలీస్ అధికారులకు ఇంచార్జి బాధ్యతలు ఇవ్వడం జరుగుతుందన్నారు. సమస్య లు ఉంటే సంబంధిత ఇంచార్జి లను సంప్రదించలన్నారు. అదే విధంగా గ్రామ పెద్దల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు. పేకాట, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే, గంజాయి అమ్మితే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశం లో రూరల్ ఎ. ఎస్. ఐ. మారుతి, ఆయా గ్రామాల అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Leave a Comment