రోడ్డెక్కిన పోలీస్ భార్యలు

వరంగల్ పోలీసు భార్యలు నిరసన

వరంగల్ జిల్లా, అక్టోబర్ 22, 2024:

పోలీసులు ప్రజల శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, రాజకీయ నాయకుల ఆస్తులకు రక్షణ కల్పిస్తుంటే, వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆందోళనకు దిగుతున్నారు. వరంగల్ జిల్లా మామునూరు 4వ బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాలు తమ భర్తలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేశాయి.

కానిస్టేబుళ్లు నిరంతరం డ్యూటీలో ఉండి, కనీస సెలవులు కూడా లేకుండా కుటుంబాలకు దూరంగా ఉంటున్నారని పోలీస్ భార్యలు ఆవేదనతో చెప్పారు. అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలనే కోరుతూ, ఈ నిరసన చేపట్టారు.

అధికారులు నిరసనను ఆపేందుకు ఆర్‌టీఓ ఆఫీస్ నుండి మామునూరు బెటాలియన్ వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పోలీసు కుటుంబాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్త డీజీని సమస్య పరిష్కరించేందుకు ఆదేశించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment