- హిందూ ఆలయాలపై దాడులు, దొంగతనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్న ఆందోళన
- ప్రభుత్వ వైఫల్యాల మూలంగా దుండగుల ధార్మిక స్థలాలపై దాడులు
- ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని డిమాండ్
భైంసా నర్సింహ స్వామి ఆలయంలో జరిగిన చోరీ ఘటనపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ పటేల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయాలపై దాడులు, విగ్రహాల ద్వంసాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భైంసాలోని నర్సింహ స్వామి ఆలయంలో జరిగిన చోరీ ఘటనపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ పటేల్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసాలు, దొంగతనాలు ప్రభుత్వ పాలన వైఫల్యాల కారణంగా పెరిగిపోతున్నాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ దాడులను నిరోధించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆలయ భద్రతకు సంబంధించి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు.
చోరీకి పాల్పడిన దొంగలను కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని మోహన్ పటేల్ హెచ్చరించారు. ఆలయాలపై దాడులు ఆపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నది ఆయన డిమాండ్.