ఆదిలాబాద్ జిల్లా
అక్టోబర్ 19 (సూర్యదిశ)
ఇచ్చోడ మండల కేంద్రంలో, సిడిపిఓ ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్యశాలలో పౌష్టికాహారం లోపం గల పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుడు కిరణ్ సూచనల ప్రకారం, శ్యామ్ మాయామ్ పిల్లలకు రోజు వారి బాగంలో పౌష్టికాహారంతో పాటు ఇతర ఆహారాలు అందించాలని అంగన్వాడీ ఉపాధ్యాయులకు మరియు తల్లి తండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు స్వప్న మరియు బబిత పాల్గొన్నారు.