- భార్యాభర్తల పంచాయతీ కోసం వచ్చిన లాకవత్ శీను పోలీస్ స్టేషన్ ముందు నిప్పంటించుకున్నాడు.
- ఇద్దరు పోలీసులు, ఎస్సై సాయి ప్రసన్న కుమార్ మరియు కానిస్టేబుల్ రవీందర్, ఈ ఘటనలో గాయపడ్డారు.
- క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ వద్ద భార్యాభర్తల పంచాయతీ కోసం వచ్చిన లాకవత్ శీను తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. కాపాడబోయిన ఎస్సై సాయి ప్రసన్న కుమార్, కానిస్టేబుల్ రవీందర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.
జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో గురువారం మధ్యాహ్నం సంచలన సంఘటన చోటుచేసుకుంది. కొండాపురం గ్రామ శివారు మేకలతండాకు చెందిన లాకవత్ శీను తన భార్య రాధికతో కలహాలు కారణంగా పోలీస్ స్టేషన్ కు వచ్చాడు.
భార్య రాధిక తన భర్త వేధింపులు భరించలేక, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కౌన్సిలింగ్ కోసం పోలీసులు ఇద్దరినీ స్టేషన్‌కు పిలిపించారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన శీను తన వాహనంలో ఉన్న పెట్రోల్ తీసుకొని తన ఒంటిపై పోసుకొని, నిప్పంటించుకున్నాడు.
ఈ ఘటనలో, కాపాడబోయిన ఎస్సై సాయి ప్రసన్నకుమార్ మరియు కానిస్టేబుల్ రవీందర్ కు మంటలు అంటుకున్నాయి. సాయి ప్రసన్నకుమార్ కు చేతులకు, రవీందర్ కు చేతులు, కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్పందించిన తోటి పోలీస్ సిబ్బంది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. శీను, ఎస్సై, కానిస్టేబుల్ రవీందర్ ని ముందుగా పాలకుర్తి ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీనిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.