హైదరాబాద్:
‘దీపావళి’ పండగ సమీపిస్తున్న వేళ, గోల్డ్ లవర్స్‌కి మరో షాక్ ఎదురైంది. దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం మరియు వెండి ధరలు గురువారంతో పోలిస్తే శుక్రవారం మళ్లీ పెరిగాయి.
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 800 పెరిగి రూ. 72,400 కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 870 పెరిగి రూ. 78,980 గా ఉంది. అలాగే, కిలో వెండి ధర రూ. 2,000 పెరిగి రూ. 1,05,000 గా కొనసాగుతోంది.