డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితుడికి 10 రోజుల జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ నిందితుడికి 10 రోజుల జైలు శిక్ష

మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి కోర్టు 10 రోజుల జైలు

కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల

ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలపై కఠిన నిఘా

మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్ ప్రతినిధి నవంబర్ 03

నిర్మల్ జిల్లా దిలావర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాల్వ గ్రామానికి చెందిన బనావత్ ప్రసాద్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసుల చేత పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా, సోమవారం విచారణలో రెండవ తరగతి ప్రత్యేక న్యాయమూర్తి నర్సయ్య నిందితునికి మోటార్ వాహనాల చట్టం ప్రకారం 10 రోజుల జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ మాట్లాడుతూ, “మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకర నేరం. ఇటువంటి చర్యలు తమతో పాటు నిరపరాధుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలపై జిల్లా వ్యాప్తంగా కఠిన చర్యలు కొనసాగుతాయి” అని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment