ఒక పక్క కానిస్టేబుల్ అంత్యక్రియలు.. మరోపక్క రియాజ్ ఎన్కౌంటర్

ఒక పక్క కానిస్టేబుల్ అంత్యక్రియలు.. మరోపక్క రియాజ్ ఎన్కౌంటర్

ఒక పక్క కానిస్టేబుల్ అంత్యక్రియలు.. మరోపక్క రియాజ్ ఎన్కౌంటర్

కత్తితో దాడి చేసిన రియాజ్ పోలీస్ కాల్పుల్లో హతం

హైదరాబాద్, అక్టోబర్ 20 (M4News):

ఒక వైపు వీరమరణం పొందిన కానిస్టేబుల్ అంత్యక్రియలు జరుగుతుండగా, మరోవైపు అతనిపై దాడి చేసిన నిందితుడు రియాజ్ పోలీస్ కాల్పుల్లో మరణించాడు.

ఇటీవల రౌడీ షీటర్ రియాజ్ కత్తితో దాడి చేసి కానిస్టేబుల్ ప్రమోద్‌ను హతమార్చాడు. అనంతరం రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సమయంలో రియాజ్ ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ గుంజుకొని పారిపోవడానికి ప్రయత్నించాడు.

ఈ సందర్భంగా పోలీసులు అప్రమత్తమై రియాజ్‌పై కాల్పులు జరపగా అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు ఈరోజే వీరమరణం పొందిన కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలు పోలీస్ లాంఛనాలతో నిర్వహించారు. సహచరులు, అధికారులు ఆయనకు చివరి నివాళులు అర్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment