“బల్ల కింద మాకిస్తేనే… మీ పని చేస్తాం”
మంచిర్యాల జిల్లాలో లంచాల పర్వం — రెండు శాఖల అధికారులు ఏసీబీ వలలో
మనోరంజని, తెలుగు టైమ్స్ మంచిర్యాల ప్రతినిధి
అక్టోబర్ 31
ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులు లంచాల మత్తులో మునిగి అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరగాల్సిన చోట ఇప్పుడు లంచాల దందా మొదలైంది. తాజాగా మంచిర్యాల జిల్లాలో రెండు శాఖల అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. పశువుల షెడ్డ్ మంజూరు కోసం రూ.10 వేల రూపాయలు, సస్పెన్షన్ ఎత్తివేత కోసం రూ.2 లక్షలు లంచం అడగడం అధికారుల దురాశకు నిదర్శనం. ప్రజల హక్కులను కాజేస్తున్న ఈ అవినీతిపరులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లంచం అడిగే లేదా స్వీకరించే అధికారులపై ఫిర్యాదు చేయాలనుకుంటే, వెంటనే ఏసీబీ హెల్ప్‌లైన్ 1064 లేదా 9440446106 నంబర్లకు కాల్ చేయండి.