కడెం ఖానాపూర్ మండలంలో ఎక్సజ్ అధికారుల దాడులు
జనవరి 10 (నిర్మల్ జిల్లా ప్రతినిధి మనోరంజని తెలుగు టైమ్స్)
నిర్మల్ ఎక్సజ్ సూపరింటెండెంట్ ఎమ్మే రజాక్ ఆదేశాలమేరకు కడెం మండలంలోని పెద్దూర్ తండా, చిన్న బెల్లల, పెద్ద బెల్లల ఖానాపూర్ మండలంలోని రాంరెడ్డి పల్లె, సతీనపల్లి లో అబ్కారి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో పెద్దూర్ తండాకు చెందిన లకావత్ విజయ, హఫవత్ అనిల్, భూక్యా నీలాబాయ్ మరియు రాంరెడ్డి పల్లి కి చెందిన భూక్యా అరవింద్ లపై కేసులు నమోదు చేశారు. వారి దగ్గర నుండి 23 లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకొని 800 లీటర్ల నల్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్టు తెలిపారు. నాటుసారాయు తయారు చేసిన, అమ్మిన రవాణా చేసిన, నల్ల బెల్లం మరియు పట్టిక అమ్మిన కఠిన చర్యలు తప్పవని నిర్మల్ ఎక్సజ్ ఇన్స్పెక్టర్ రంగస్వామి తెలిపారు. ఈ దాడులలో ఆదిలాబాద్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ గంగారెడ్డి, అక్బరహుస్సేన్, నిర్మల్ ఎక్సజ్ ఎస్సై అభిషేకర్, డీటీఫ్ ఎస్సై సింధు, సిబ్బంది వెంకటేష్, ఇర్ఫాన్, హరీష్, రాజేందర్, నిరోషా పాల్గొన్నారు