🟥NEW SENSE
#Big Breaking
#Hyderabad
#Ramanthapur
….
*అత్యంత విషాదం..*
ఉప్పల్ పీఎస్ పరిధి రామంతపూర్ గోకులే నగర్ లో శ్రీకృష్ణ శోభాయాత్రలో అపశృతి…
శోభాయత్రా ముగింపు దశలో కరెంట్ షాక్ తో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి… మరో నలుగురకి గాయాలు.
స్థానిక మ్యాట్రిక్స్ ఆస్పత్రికి తరలింపు…
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో బాగంగా శ్రీకృష్ణ శోభాయాత్ర ముగింపు సమయంలో రథాన్ని తీసుకెళ్లే వెహికిల్ ఆగిపోవడంతో, ఓ పది మంది రథాన్ని నెడుతున్న క్రమంలో రథం పైన ఉన్న విద్యుత్ తీగలు రథానికి తాకడంతో జరిగిన సంఘటన, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు…
ఐదుగురు మృతదేహాలను మాట్రిక్స్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించిన పోలీసులు.
గాయాలైనా వారిలో ఒకరు మాట్రిక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, మరొకరు నాంపల్లి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది. మరో ఇద్దరు స్థానికంగా చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది
మృతుల వివరాలు కృష్ణ అలియాస్ డైమండ్ యాదవ్(21 ఓల్డ్ రామంతపూర్), శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్(34 ఓల్డ్ రామంతపూర్), రుద్ర వికాస్(39 పద్మశాలి), రాజేంద్ర రెడ్డి(45)…
ఘటన పై దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
….