: డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

APJ Abdul Kalam Jayanti Tribute Ceremony
  • APJ Abdul Kalam Jayanti Tribute Ceremonyఏపీజే డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఘన నివాళులు.
  • వివిధ రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు హాజరై కలాం జ్ఞాపకార్థం పూలమాల వేసి స్మరించుకున్నారు.
  • మిస్సైల్ స్టాచ్యూ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ కు విజ్ఞప్తి.

 

ఏపీజే డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, వివిధ పార్టీ నాయకులు, సామాజిక సేవకులు పాల్గొని కలాం జ్ఞాపకార్థం మున్సిపల్ కార్యాలయంలో పూలమాల వేసి స్మరించారు. మిస్సైల్ స్టాచ్యూ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నాయకులు మున్సిపల్ చైర్మన్ ను కోరారు.

 

ఏపీజే డాక్టర్ అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా, ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు అజార్, ప్రధాన కార్యదర్శి జావీద్, ఎంఐఎం పట్టణ అధ్యక్షులు అజీమ్ బిన్ యాహ్య, మాజీ హచ్ కమిటీ సభ్యులు నజీర్ ఖాన్, తెలంగాణ ఏక్తా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. కలాం జ్ఞాపకార్థం కలాం గులాం అధ్యక్షులు ఉస్మాన్, కౌన్సిలర్లు ఇమ్రాన్ ఉల్లా, ముజాహిద్ అలీ, అన్వర్, మాటీన్, అబ్రర్ ఖాన్, ముజాహిద్ చావుస్ తదితరులు కలాం చిత్రపటానికి పూలమాల వేసి స్మరించారు.

ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం మున్సిపల్ కార్యాలయంలో మిస్సైల్ స్టాచ్యుని నిర్మించాలని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ గారిని కోరారు. గత నాలుగు సంవత్సరాలుగా నిర్మాణం సాగకపోవడంతో ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కలిసి మసైల్ స్టాచ్యూ నిర్మాణానికి మద్దతు తెలపాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment