పెంట్లవెల్లి మండలంలో భక్తిశ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ట
- మత్స్యకారుల కులదైవం గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట
- మత్స్య సహకార సంఘాల భద్రత, అభివృద్ధికి ఆశీస్సులు కోరిన వాకిటి ఆంజనేయులు
- కార్యక్రమంలో పలువురు సంఘ ప్రతినిధులు, స్థానిక నాయకుల పాల్గొనిక
నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. డిస్టిక్ ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ వాకిటి ఆంజనేయులు పాల్గొని మత్స్యకారుల క్షేమం కోసం గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్య సహకార సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల హెడ్ క్వార్టర్‌లో ఈరోజు గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. మత్స్యకారుల కులదైవంగా పూజించబడే గంగమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించడంతో పాటు గరుడ స్తంభ ప్రతిష్ట కార్యక్రమం కూడా జరిగింది.
ఈ సందర్భంగా డిస్టిక్ ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ వాకిటి ఆంజనేయులు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా మత్స్య సహకార సంఘాల అభివృద్ధికి గంగమ్మ తల్లి ఆశీస్సులు కోరారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వ సహాయాన్ని మరింతగా పొందేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పెంట్లవెల్లి సొసైటీ అధ్యక్షులు కుమారస్వామి, పెద్దపల్లి సొసైటీ అధ్యక్షులు ఆంజనేయులు, శ్రీవారి సముద్రం సింగోటం సొసైటీ సెక్రటరీ పెబ్బేటి మల్లేష్, కొండూరు సొసైటీ అధ్యక్షులు రాముడు, సభ్యులు బాలరాజు, నల్లమోని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.