YSR Jayanti : ఈరోజు వైయస్సార్ జయంతి..!!

YSR Jayanti : ఈరోజు వైయస్సార్ జయంతి..!!

YSR Jayanti : ఈరోజు వైయస్సార్ జయంతి..!!

ఈరోజు (జూలై 8) వైయస్ రాజశేఖర రెడ్డి (YSR ) జయంతి. ఆయన పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే అంశాలు – ఆరోగ్యశ్రీ, 108 అత్యవసర వాహన సేవ, 104 ఆరోగ్య సేవలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, అన్నీ సామాన్యుడి జీవితానికి సంబంధించి.
ఆయన ఆవిష్కరించిన పథకాలు ప్రజల జీవితాల్లో తీరని ముద్ర వేసాయి. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో ‘ఆరోగ్యశ్రీ’ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది.

వైయస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ విజయం

వైయస్సార్ 2003లో చేసిన పాదయాత్ర ఆయన ప్రజల మనసును గెలుచుకున్న ఘట్టంగా నిలిచింది. దీని ఫలితంగా 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తన నిస్వార్థ సేవా ధోరణి, అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందిన వైయస్సార్ 2009లో రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచారు. కానీ అదే ఏడాది సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ ప్రజలను విషాదంలో ముంచింది.

రాజకీయ జీవితం – ఓటమికి తావులేని నేత

వైయస్సార్ 31 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఓటమిని చూసి చూసి లేరు. ఆయన 6 సార్లు MLAగా, 4 సార్లు MPగా విజయం సాధించారు. ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలపై నిబద్ధతతో పనిచేసిన నేతగా ఆయనకు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన జయంతిని సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన సేవలు స్మరించుకుంటూ, అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైయస్సార్ చరిత్రలో ఒక వెలుగు బంగారంలా నిలిచిన నాయకుడు

Join WhatsApp

Join Now

Leave a Comment