పెద్దలు కుదిర్చిన పెళ్ళీలకు మొగ్గు చూపుతున్న యువత
భారతీయ సమాజంలో పెళ్ళికి చాలా ప్రాధాన్యత వుంది .పెళ్లంటే నూరేళ్ల పంట వంశాభివృద్ధికి పునాది.ఇద్దరు వ్యక్తుల మధ్య శారీరక మానసిక ఆత్మ సంబంధమైన అన్నోన్య బంధమే పెళ్ళి .పెళ్లి అనేది భాగస్వాముల మధ్య ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభoధం ఏర్పడేందుకు పునాది.పరస్పరం ఒకరికి ఒకరు గౌరవించుకుంటు ఒకరిపై ఒకరు ఆధారపడి షరతులు లేని ప్రేమాభిమానాలతో సాగిపోయే జీవితానికి ఆహ్వానం పలికే ఒక మధురమైన సన్నివేశం పెళ్లి.
జీవితం పెళ్ళి
మనిషి జీవితంలో వివాహం ప్రధాన ఘట్టం పెళ్లి తో మనుషుల జీవితాలలో కొత్త మలుపు మొదలవుతుంది.. పెళ్లి కుటుంబ వ్యవస్థ ఏర్పాటుకు సమాజ నిర్మాణానికి పునాది .రెండు కుటుంబాల మధ్య వారధి.
ప్రేమ పెళ్లి పెద్దలు చేసిన పెళ్ళి
భారత దేశములో పెద్దలు కుదిర్చిన పెళ్ళీలు మరియు ప్రేమ పెళ్ళీలతో జంటలు ఏకమౌతున్నరు.మతాలు ఏవైనా’ కులాలు ‘ఏవైనా పెళ్లి అనేది భాగస్వాములు జీవిత కాలం కలిసి ఉండాలన్నది ప్రధాన ఆశయం.గతంలో తల్లి తండ్రుల ఇష్ట ప్రకారం పెళ్ళిళ్ళు జరిగేవి. ఇప్పుడు పెళ్లికి ముందే యువతి యువకులు స్నేహాలు’ ప్రేమలు డేటింగులు’ షికార్లు తోగడుపుతున్న సందర్భాలు ఉన్నాయి.తెలిసి తెలియని ఉరకలు వేసే వయసులో
ఒకరికి ఒకరు ఇష్టపడి ప్రేమ మొదలై పెళ్లిళ్లకు దారితీస్తుంది. ఇద్దరి మధ్య జీవితం పై అవాగాహన లేక పెళ్లి ఐయిన కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్న జంటలను ఈ సమాజంలో చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం సరైన గైడెన్స్ చెప్పే వారు లేక పోవడం. మెరుగైన సామాజిక సంభందాలు లేక పోవడం. సకాలములో పెద్దల సలహాలు సహకారం లోపించడం ప్రధాన కారణాలు.
యువత ప్రేమ పెళ్ళిలు
భారతీయ యువత ప్రేమ పెళ్ళిల మీద శ్రద్ధ చూపుతున్నారు. యుక్త వయసులో తమకు కాబోయే జీవిత భాగస్వామి ఎంపికలో యువత వ్యక్తి గత స్వేచ్ఛ ఎంపిక పట్ల ఉత్సాహం చూపిస్తున్నారు.
చిన్నప్పటి స్కూల్ కాలేజ్ క్లాస్ మట్ లను పెళ్లి చేసుకోవడంలో యువత తమ ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచీకరణ ‘విదేశీ సంస్కృతి ‘విదేశీ చదువులు’ విదేశీ కొలువులు చేస్తూ కులాంతర వివాహాలు ప్రేమ వివాహాల వైపు మొగ్గు చూపే సంస్కృతి యువతలో రాజ్యమేలుతుంది.
భారతీయ సినిమాలు చూస్తే ప్రేమ తప్ప మరొకటి కనిపించదు. యువత ఆలోచనలన్నీ ప్రేమ పెళ్లి చుట్టూనే తిరుగుతూ ఉంటాయని పిస్తుంది .అది కొంత వరకు వాస్తమే.
పెళ్ళిల పై అధ్యయనం సర్వే
దేశంలో ఇటీవల వివాహాల
స్వరూపం స్వభావం మీద జరిపిన అద్యయనాల ప్రకారం యువత అధిక సంఖ్యలో పెద్దలు కుదిర్చిన వివాహలనే చేసుకుంటున్నారని
తేలింది.
2018 సంవత్సరం లో 1’60’000 కంటే ఎక్కువ కుటుంబాల పై జరిపిన సర్వేలో వివాహితుల్లో 93 శాతం తమది పెద్దలు కుదిర్చిన వివాహమే అని చెప్పారు.కేవలం 3 శాతం మాత్రమే ప్రేమ వివాహం చేసుకున్నారు. మరో 2 శాతం ప్రేమ ప్లస్ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు అంటే పెద్దలే ఈ సంభ్నందాన్ని కలుపుతారు. పరిచయం అయ్యాక అబ్బాయి అమ్మాయి ప్రేమలో పడి పెళ్లికి ఒప్పుకుంటారు కాలముతో పాటు ఈ శాతాలలో పెద్దగా మార్పులేదు .
80 యేళ్లు దాటి వారిలో 94 శాతం మంది తమది పెద్దలు కుదిర్చిన వివాహం అని చెప్పారు20.యేళ్లు దాటిన వారిలో90 శాతం కన్నా ఎక్కువ జంటలు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న వారేనని అధ్యయనంలో తేలింది.
ప్రేమ పెళ్లిలుతక్కువే
2014 లో 70000 కంటే ఎక్కువ మందిపై జరిపిన సర్వేలో పట్టణ ప్రాంతాల్లో నివసించే భారతీయుల్లో కులాంతర వివహాం చేసుకున్నవారు 10 శాతం కంటే తక్కువే అని తేలింది. మతాంతర వివాహం అంతకన్న తక్కువ కేవలం 5 శాతం మాత్రమేనని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
కులాంతర ‘మతాంతర ‘వివాహాలు చేసుకోవడానికి అభ్యంతరం వ్యక్తం చేయని యువత వివాహ సమయంలో వివాహాం మాత్రం పెద్దలు కుదిర్చిన వారితోనే చేసుకుంటున్నారని తేలింది . పెళ్ళిల మీద జరిగిన పలు అధ్యయనాలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వివాహాల తీరుకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది.జనవరి 2018 నాటికి భారత దేశములో ప్రేమ వివాహాలు చేసుకున్న వారు 3 శాతం మందే అని సర్వేలో తేలింది .మంచి చదువు ఉద్యోగం చేస్తున్న ఒక దళిత యువకున్ని వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చే వారి సంఖ్య అతి తక్కువగానే ఉంటుంది.తెగించి పెళ్లి చేసుకుంటే కుటుంబ సభ్యుల భందువుల ద్వారా బెదిరింపులు తిరస్కారాలు సాంఘిక బహిష్కరణ’ గృహ బహిష్కరణకు గురౌతున్నారు.పరువు కోసం ప్రాణాలను భలికొనే సంస్కృతి సామాజిక లక్షణంగా పరిణమించడం శోచనీయం.పరువు హత్యలు
ఇటీవలదేశంలో అనేక ప్రాంతాల్లో కులాంతర వివాహాలు చేసుకున్న జంటల పట్ల అమానుష అమానవీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పరువు హత్యలు సమాజానికి సవాళ్ గా పరిణమించాయి.
ఇలాంటి పరిస్థతుల్లోయువతీ యువకులు మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవాలంటే
పెద్ద యుద్ధమే చేయ్యలసి వస్తుంది.
సొంత కులం వారితో పెళ్లి
2015లో మాట్రి మొనియాల్ సైట్లలో 1000మంది అమ్మాయిలను సంప్రదిస్తే సగం మంది కులాంతర వివాహాలకు అభ్యంతరం లేదని చెప్పిన చాలా వరకు అమ్మాయిలు వివాహ సమయంలో సొంత కులానికి చెందిన అమ్మాయిలను వివాహం చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారని సర్వేలోతేలింది.
,..2013 సం”లో ఢిల్లీలో ఏడు జిల్లా కోర్టుల్లో అత్యాచారానికి సంబంధించిన కేసుల విచారణ జరిగింది. ప్రతి కేసులో విచారణ ముగిసిన 460 కేసుల్లో 40 శాతం సమ్మతి వున్న జంటలకు సంబందించిన కేసులు కావటం గమనార్హం.
కోర్టు విచారించిన 460 కేసుల్లో 40శాతం అమ్మాయి అబ్బాయి ఒకరికి ఒకరు ఇష్టపడ్డ కేసులే చాలా వరకు కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వారే వాళ్ళు ప్రేమించుకొని ఇంటినుండి పారిపోయిన తర్వాత అమ్మాయి తల్లి తండ్రులు అబ్బాయి మీద అత్యాచారం అపహరణ కేసులు పెట్టారు.తమ బిడ్డ కులాంతర వివహం చేసుకుంది అనే దాని కంటే అత్యాచారానికి గురైంది అని చెప్పుకోవదానికి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని మానసిక స్థితికి తల్లి తండ్రులు గురౌతున్నారనీ సర్వేల్లో వెల్లడైంది.
సామాజిక శాస్త్రవేత్తల ఆందోళన
తమ కంటే తక్కువ కులం అబ్బాయిని ప్రేమించిందని పరువు హత్యాలకు పాల్పడే ప్రమాదకర దోరుణులు ప్రభలి శాంతి భద్రతల సమస్యగా పరిణమించడం గమనార్హం .కులాల మధ్య కుమ్ములాటలు .కుల విద్వేషాలు చోటుచేసుకుని సామాజిక సమరసత కులాల మధ్య సంఘీభావం సామరస్యత దెబ్బతింటుంది. కులాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం సామాజిక శాంతికి విఘాతం కలుగుతుందని సామాజిక శాస్త్ర వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టాలు శిక్ష
దేశములో రాను రాను పరిస్థితులు దిగజారే ప్రమాదం వుంది.కొన్నేళ్లుగా అతివాద హిందూ గ్రూపులు “లవ్ జిహాదీ” అనే పదం తెరపైకి వచ్చింది. పెళ్ళి పేరుతో అమ్మాయి మతం మార్పిడి చేసే అబ్బాయిలకు కటిన చట్టాలు శిక్షలు అమల్లోకి తేవటానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.
భార్య భర్తల ప్రేమ నమ్మకం
ప్రేమ పెళ్లి కాని పెద్దలు కుదిర్చిన పెళ్లి కాని కేవలం భార్య భర్తలపైనే ఆధారపడి ఉంటుంది.ముఖ్యంగా వారి మధ్య వున్న ప్రేమ నమ్మకం విశ్వాసం పరస్పరం కురిపించుకునే ప్రేమానురాగాలు ఈ విషయములో కీలక పాత్ర పోషిస్థాయి.జీవితం పంచు కోవడానికి తగిన వ్యక్తిని ఎంపిక చేసుకుంటే అది ప్రేమ వివాహమైన లేక పెద్దలు కుదిర్చిన వివాహమైన జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది. పరస్పరం అవగాహాన సహకారం మంచితనం ఆత్మీయత బంధువులతో మెరుగైన సంభందాలు కష్ట సుఖాలు పంచుకోవడం మంచిని పెంచడం కుటుంబ అభివృద్ధిలో భాగస్వాములు కావడం పండుగలు ఆత్మీయుల కలయికలు భందువులతో సామూహిక పండుగలు జరుపుకోవడం .కుటుంబ పెద్దల పట్ల గౌరవం ఆత్మీయత అభిమానం అనురాగం ప్రేమ మెరుగైన జీవనవి లువలు కుటుంబాల సాంప్రదాయాన్ని ఆచారాలను పాటించాలి.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ
సమాజం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పునర్జీవంతో వివాహ వ్యవస్థ పవిత్రతకు పునరంకితం కావాలి.
మమత మానవీయత ఆదరణ ఆర్ధత అనురాగాల ఆలంబనగా
ఆదర్శనీయమైన జీవన శైలితో
యువత వివాహ వ్యవస్థ పవిత్రత పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలి.
నేదునూరి కనకయ్య
అద్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం 9440245771