రాజకీయాల్లో యువత రాణించాలి – మంగాయి సందీప్ రావు,

*రాజకీయాల్లో యువత రాణించాలి – మంగాయి సందీప్ రావు, ముధోల్ నియోజకవర్గం.*

మనోరంజని తెలుగు టైమ్స్ నిర్మల్, డిసెంబర్ 04

గ్రామం అభివృద్ధి ప్రజల చేతుల్లోనే ఉందని, ముఖ్యంగా యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందని సందీప్ రావు ఫౌండేషన్ చైర్మన్ సందీప్ రావు పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికలు కేవలం ఓటు వేసే కార్యక్రమం కాదు, గ్రామ భవిష్యత్తును నిర్దేశించే కీలక ఘట్టమని ఆయన తెలిపారు. గ్రామం అంటే మనగానే—మన సంస్కృతి, పంటలు, బంధాలు, భవిష్యత్తు అన్నది ప్రతి ఓటరు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. “మంచి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామం వెలుగులు చూస్తుంది. అభివృద్ధి, పథకాలు, రహదారులు, విద్య, నీటి వనరులు — ఈ అన్నీ సరైన నాయకత్వంపై ఆధారపడి ఉంటాయి” అని సందీప్ రావు అన్నారు. ఎన్నికలు పోటీ కోసమో, అబద్ధపు వాగ్దానాల కోసమో కాకుండా గ్రామ ప్రయోజనం కోసం నిబద్ధతతో పనిచేసే నాయకుడిని గుర్తించాల్సిన సమయం ఇదేనని యువతను ఉద్దేశించి పేర్కొన్నారు. పార్టీ కంటే వ్యక్తి నిజాయితీ, మాటల కంటే చేసిన పనులు ముఖ్యమని అన్నారు. గ్రామ అభివృద్ధిలో యువత, మహిళలు కీలక పాత్రదారులని, ఓటు వేయడమే కాదు గ్రామ నిర్ణయాలలో కూడా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. “మీరు మాట్లాడితే—గ్రామం మాట్లాడినట్లే” అని సందీప్ రావు సందేశం ఇచ్చారు. ఓటు వేసిన వెంటనే బాధ్యత పూర్తయ్యే పనికాదు. ఎన్నికల అనంతరం కూడా నాయకులను ప్రశ్నించడం, జవాబుదారులను చేయడం ప్రజల బాధ్యత అని సందీప్ రావు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment