యువత స్వయం ఉపాధి పథకాల ద్వారా ఉపాధి పొందాలి: గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి ఆగస్టు 3 :
స్వయం ఉపాధి పథకాల ద్వారా పదిమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తెలిపారు. శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని బుల్కాపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంకును ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు అనుముల కొండల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేయడంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శంకర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కా శెట్టి మోహన్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులా నాయక్, జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు బొల్లారం వెంకటరెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లారం ప్రశాంత్ రెడ్డి, శంకరపల్లి సహకార సంఘం డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వై ప్రకాష్ గుప్తా, మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ చంద్రమౌళి, నాయకులు వెంకట్ రెడ్డి, దయాకర్ మహిపాల్ యాదవ్, రఘునందన్ రెడ్డి ,కాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి ,కృష్ణారెడ్డి, ప్రశాంత్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు