మీకు బతుకమ్మ – నాకు బతుకుదెరువు”

మీకు బతుకమ్మ – నాకు బతుకుదెరువు”

మీకు బతుకమ్మ – నాకు బతుకుదెరువు”



కరీంనగర్, సెప్టెంబర్ 21 (M4News):

కరీంనగర్ నగరంలోని ఓ కాలనీలో బతుకమ్మలాడే ప్రదేశంలో బుగ్గలు అమ్ముతున్న ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కుటుంబాన్ని పోషించుకోవడానికి బుగ్గలు అమ్మడం తప్ప తనకు మరో మార్గం లేదని ఆమె చెప్పింది.

బతుకమ్మ పండుగ కోసం పూలతో అలంకరించబడిన ప్రాంగణంలో స్త్రీలు సాంప్రదాయబద్ధంగా ఆడిపాడుతుంటే, పక్కనే నిలబడి బుగ్గలు అమ్ముకుంటూ తన పిల్లలకు భోజనం పెట్టడానికి శ్రమిస్తున్న ఆ మహిళ పరిస్థితి అక్కడి వారిని కదిలించింది.

“మీకు బతుకమ్మల ఆనందం, నాకు మాత్రం బతుకుదెరువు కోసం ఈ బుగ్గలే ఆధారం” అని ఆమె చెప్పిన మాటలు అక్కడివారిని ఆలోచింపజేశాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment