కుంటాల లో ఘనంగా ముగిసిన కుస్తీ పోటీలు

కుంటాల లో ఘనంగా ముగిసిన కుస్తీ పోటీలు

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ఆదివారం ఉదయం నుండి కుస్తీ పోటీలను గ్రామ పెద్దలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడు కూడా కుస్తీ పోటీలను నిర్వహించారు. ఉమామహేశ్వర ఆలయం ముందు గ్రామస్తులు అందరూ బాజా భాజంత్రాల తో మైదానంలో చేరుకొని ముందుగా చిన్నారులతో కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలు తిలకించడానికి పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి కుస్తీ పోటీలను తిలకించారు. ఈ కుస్తీ పోటీలలో తల పడడానికి మల్ల యోధులు పరిసర ప్రాంతాల నుండి కాక మహారాష్ట్ర లోని ధర్మాబాద్ బోకర్ నాందేడ్ ఉమ్రి తాలూకాలోనుండి పెద్ద ఎత్తున తరలివచ్చి కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. గ్రామస్తుల గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో కుస్తీ పోటీల్లో గెలుపొందిన ప్రతి ఒక్క మల్ల యోధునికి బహుమతులు ప్రధానం చేశారు. కుస్తీ పోటీల లో ఏ లాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కుంటాల ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలు ఘనంగా ముగిశాయి

Join WhatsApp

Join Now

Leave a Comment