మహిళల సమగ్రాభివృద్ధికి మహిళా సంఘాలే బలమైన వేదిక: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

మహిళల సమగ్రాభివృద్ధికి మహిళా సంఘాలే బలమైన వేదిక: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

మహిళల సమగ్రాభివృద్ధికి మహిళా సంఘాలే బలమైన వేదిక: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

మనోరంజని ప్రతినిధి నిర్మల్ జులై 18 – జిల్లాలో మహిళల ఆర్థిక, సామాజిక శక్తీకరణకు మహిళా సంఘాలు ప్రధానమైన వేదికలుగా మారుతున్నాయని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిర్మల్ పట్టణంలోని పెన్షనర్ల భవనంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన *”ఇందిరా మహిళా శక్తి సంబరాలు”*లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. మహిళా సంఘాల సభ్యులు అతిథులకు పూల మొక్కలు అందిస్తూ ఆత్మీయంగా స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “అర్హులైన ప్రతి మహిళ మహిళా సంఘాల్లో చేరేలా అధికారులు ప్రోత్సహించాలి. మహిళా సంఘాల ద్వారా వారి ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వ మద్దతు మరింతగా అందిస్తాం” అని హామీ ఇచ్చారు.అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ:

మహిళల సమగ్రాభివృద్ధికి మహిళా సంఘాలే బలమైన వేదిక: ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

జిల్లాలో మొత్తం 12,043 మహిళా సంఘాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
ఈ సంఘాల్లో 1,39,361 మంది సభ్యులు ఉన్నారు.నిర్మల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో 4,986 సంఘాల ద్వారా 57,908 మహిళలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నారు.2025-26 ఆర్థిక సంవత్సరంలో 816 సంఘాలకు రూ.74.40 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరయ్యాయి.
నియోజకవర్గ స్థాయిలో 282 సంఘాలకు రూ.27.86 కోట్లు, గత సంవత్సరానికి సంబంధించి 29,676 సంఘాలకు రూ.34.28 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్లు తెలిపారు.మహిళా శక్తి క్యాంటీన్లు, అమ్మ పాఠశాలలు, ఐకెపి సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు, కుట్టుమిషన్లతో యూనిఫాం తయారీ, పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి రంగాల్లో మహిళా సంఘాలు చురుగ్గా పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. మహిళా సంఘాల కోసం మంజూరైన రూ.3 కోట్లతో రెండు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.ఈ సందర్భంగా:

24 మంది లబ్ధిదారులకు రూ.16.97 లక్షల విలువైన చెక్కులు,

రూ.10 లక్షల విలువైన ప్రమాద భీమా చెక్కు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.

ఉత్తమ ప్రగతిని సాధించిన మహిళా సంఘ సభ్యులను శాలువాలతో సత్కరించారు.

కార్యక్రమంలో మహిళలు తమ అభివృద్ధి పయనాన్ని పంచుకోగా, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత బృందాలు మహిళా సాధికారతపై ప్రదర్శనలు ఇచ్చాయి.

కార్యక్రమంలో సెర్ప్ డైరెక్టర్ కృష్ణకుమార్, డీఆర్డీఓ ఇన్‌చార్జి శ్రీనివాస్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గంగామణి, ఇతర అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment