ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వంగ మహేందర్ రెడ్డిని గెలిపించండి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

ముధోల్ : అక్టోబర్ 21

ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా వంగ మహేందర్ రెడ్డిని గెలిపించాలని పిఆర్టియు టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి. రమణారావు అన్నారు. మండల కేంద్రమైన ముధోల్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, గిరిజన సంక్షేమ గురుకుల, బీసీ సంక్షేమ గురుకుల, మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో అర్హత గల అందరు ఉపాధ్యాయులు ఓటరు నమోదు చేసుకోవాలని అభ్యర్థించారు. 53 ఏళ్లుగా ఉపాధ్యాయులకు అనేక జిఓలను తెచ్చి, వారి జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా, ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న పిఆర్టియు టీఎస్ సంఘ అధికారిక అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

భవిష్యత్తులో గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి సంఘం కృషి చేస్తుందని చెప్పారు. ముఖ్యంగా, ఎన్నో సంవత్సరాలుగా గురుకుల ఉపాధ్యాయులు అడుగుతున్న 010 పద్దు ద్వారా వేతనాలు ఇప్పించడానికి సంఘం కృషి చేస్తోందన్నారు. అన్ని గురుకుల పాఠశాలను ఒకే గూడు కిందకి తీసుకొని, ఒకే రకమైన సమయసారిని, ఒకే రకమైన సౌకర్యాలను కల్పించడానికి సంఘం ప్రయత్నిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పి. ప్రవీణ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అహాది, జిల్లా ఉపాధ్యక్షులు పి. రవీందర్ రెడ్డి, పాఠశాలల ప్రిన్సిపాల్ లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment