పర్యావరణ పరిరక్షణలో వన్యప్రాణుల పాత్ర – అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
M4News ప్రతినిధి – సారంగాపూర్, అక్టోబర్ 9
పర్యావరణ–వన్యప్రాణుల వారోత్సవాల ముగింపు సందర్భంగా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ఆశ్రమ పాఠశాలలో బుధవారం బాలికల విద్యార్థులకు “పర్యావరణ పరిరక్షణలో వన్యప్రాణుల పాత్ర” అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా అటవీ అధికారులు విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ, “వన్యప్రాణులు ప్రకృతిలో సమతౌల్యం కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటి సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత” అని సూచించారు.
కార్యక్రమంలో ఉప అటవీ క్షేత్రాధికారి ఎం.డి. నజీర్ ఖాన్, ప్రధాన ఉపాధ్యాయురాలు అనూష, ఉపాధ్యాయులు, అటవీ బీట్ అధికారులు వెన్నెల, సుజాత, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.