ఎఫైర్.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అతని భార్య, ఆమె ప్రియుడి కలిసి హత్య చేశారు. కర్ణాటక హవేరి జిల్లాలోని రట్టిహళ్లిలో గురువారం ఈ ఘటన జరిగింది. మృతుడిని హరిహార్‌కు చెందిన షఫీవుల్లా (38)గా గుర్తించారు. కాగా, ఈ కేసులో నిందితులైన షహీనా బాను, ఆమె ప్రేమికుడు ముబారక్ కలందర్సబ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న షఫీవుల్లాను జూలై 27న సరస్సు వద్దకు తీసుకెళ్లి హత్య చేశారని పోలీసులు తెలిపారు